2029లో జగన్ ఎలా గెలుస్తాడో చూస్తాను అంటూ హోటకామెంట్స్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని నరసింహాపురంలో రూ.1290 కోట్లతో అతిపెద్ద తాగు నీటి పథకం పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం మాట్లాడారు.

నేనెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది అని వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను సినిమా డైలాగ్లు చెప్పను… సింహం గడ్డం గీసుకుంది, నేను గీసుకోలేదు అనే డైలాగ్లు సినిమాలో కూడా చెప్పడానికి నేను ఇబ్బంది పడుతానని చెప్పారు. మెడకాయలు కోసేస్తాం అంటే చొక్కా ఇప్పి చూపిస్తామా? అని ఆగ్రహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
2029లో జగన్ ఎలా గెలుస్తాడో చూస్తాను – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ pic.twitter.com/5m99l67nkq
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025