తెలంగాణ మహిళలకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

తెలంగాణలో మహిళలకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో మహిళలకు 50% రిజర్వేషన్ రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అమ్మలు, అక్కలు అసెంబ్లీలో, పార్లమెంటులో భారీగా విజయం సాధిస్తారని తాము దగ్గర ఉండి గెలిపిస్తామని అన్నారు. కోటి మంది మహిళలని కోటీశ్వరుల్ని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

cm revanth
cm revanth

మహాలక్ష్మి పథకం, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఇందిరా SHGల ఏర్పాటు ఇలా అన్ని విభాగాలలో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 70 లక్షల మంది రైతులకు 9 రోజులలో రూ. 9 వేలకోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. కాగా, మరోవైపు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 100 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news