తెలంగాణలో యూరియా కొరత.. KTR సంచలన ట్వీట్

-

తెలంగాణలో యూరియా కొరత..ఉందని KTR సంచలన ట్వీట్ చేశారు. రైతు భరోసా లేదు … రైతు రుణమాఫీ లేదు… కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువొచ్చిందని చురకలు అంటించారు. మీరు అడిగినట్టు ఆధార్ కార్డులు ఇచ్చినా, రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? అని ఫైర్ అయ్యారు కేటీఆర్.

KTR
KTR

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుంది రైతులకు వివరించాలి… ₹266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు ₹325 ఎలా అయ్యిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరు? ఈ కృత్రిమ కొరత ఎవరివల్ల ఏర్పడుతుందో, ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మెతన్నలు ఎవరో వెంటనే విచారణ జరిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news