సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఆడబిడ్డలను కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన అని అన్నారు. ఆడబిడ్డలపై నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల చాలామంది సర్పంచులు, MPTC, ZPTC లు అయ్యారు. త్వరలోనే ఎమ్మెల్యే సీట్లలో మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మంచి పనులు చేసిన మహిళలను గుర్తించి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ పేర్కొన్నారు. 60 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.