Mynampally Hanumantha Rao: మైనంపల్లి హనుమంతరావుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావును తన క్యాడర్ కూడా ఒంటరి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే మైనంపల్లి హనుమంతరావు కు సంబంధించిన అనుచరులు గులాబీ పార్టీలో చేరబోతున్నారట.

వర్గ విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ పార్టీ గూటికి మైనంపల్లి హనుమంతరావు అనుచరులు వెళ్లేందుకు సిద్ధమయ్యారట. కాంగ్రెస్ పార్టీని వీడి… గులాబి పార్టీ కండువా కప్పుకునేందుకు మెదక్ జిల్లా నేతలందరూ రెడీ అవుతున్నారట. ఇవాళ మధ్యాహ్నం కేటీఆర్ అలాగే హరీష్ రావు సమక్షంలో గులాబీ గూటికి చేరుకోబోతున్నారట నేతలు. ఇది ఇలా ఉండగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు మైనంపల్లి హనుమంతరావు.