తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మహిళా సంఘాల ప్రమాద బీమాను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సంఘాలకు ప్రమాద బీమాను మరో నాలుగు సంవత్సరాల పాటు పొడగించనున్నట్లు.. అధికారిక ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.

స్త్రీ నిధి ద్వారా బీమా అమలు 2029 వరకు కొనసాగించాలని కూడా ఈ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుంది. ఇప్పటివరకు 419 మంది ప్రమాద బీమా కోసం అప్లై.. చేసుకోగా 204 మందికి పరిహారం అందింది. ఇది ఇలా ఉండగా… స్వయం సహాయక సంఘాలలో 47 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు.