నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ జరగలేదు. వేమిరెడ్డి దంపతులు ఇలా రాజకీయం చేస్తారని అస్సలు అనుకోలేదు. నేను నా కొడుకు బయటకు వెళ్లిన తర్వాత దాడి చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ధ్వంసం చేశారు.

దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించి భయపెట్టారు. ఆ సమయంలో నేను ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేసేవారు అంటూ వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఈ దాడిలో ప్రసన్నకుమార్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తన కారుతో సహా విలువైన వస్తువులు అన్నీ పూర్తిగా పాడయ్యాయి. ప్రసన్న కుమార్ రెడ్డికి తప్పకుండా న్యాయం చేయాలి అంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.