మల్టీపర్పస్ వర్కర్లకు గుడ్ న్యూస్.. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందజేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల పెండింగ్ జీతాలను రూ. 150 కోట్లు ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. ఈరోజు గ్రామపంచాయతీల ఖాతాలలో ఈ నిధులు జమ కానుండగా ఒకటి రెండు రోజులలో 53, 000 మంది మల్టీపర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.

దీంతో వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళ మొక్కలను నాటాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని మొక్కలను మహిళలు వారి పిల్లల లాగా చూసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.