BRS: మేడిగడ్డపై మరో కుట్ర…బ్యారేజ్ పైకి వాహనాల అనుమతి !

-

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలొస్తున్నాయి.పిల్లర్ల కుంగుబాటు సాకుతో బరాజ్‌ పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడి సెక్యూరిటీని ఎత్తివేసిందని గులాబీ పార్టీ పేర్కొంది. ఫలితంగా బరాజ్‌ పైనుంచి వాహన రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాహన రాకపోకలతో కుంగిన పిల్లర్లపై ఒత్తిడి పడి అవి కొట్టుకుపోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబటిపల్లి మీదుగా మేడిగడ్డ బరాజ్‌పై నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. డీసీఎంలు, ట్రాక్టర్లు పొద్దంతా భారీ లోడ్లతో పయనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను ప్రత్యేకించి ఆ రాష్ట్ర రైతులకు గోదావరి నీటిని బహుమానంగా ఇవ్వాలన్నది రెండో ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నదని కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న నీటిపారుదల, రాజకీయ నిపుణులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news