ఏపీలోని రైతులకు తీపికబురు..ఇవాళ రూ.260 కోట్లు ఖాతాలలో జమ

-

ఏపీలోని రైతులకు తీపికబురు..ఇవాళ ఏపీలోని రైతుల ఖాతాలలో రూ.260 కోట్లు జమ కానున్నాయి. నేడు మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ కానున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మామిడి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 250 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

260 crores will be deposited in the accounts of farmers in AP today
260 crores will be deposited in the accounts of farmers in AP today

కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కిలోపు అదనంగా నాలుగు రూపాయలు మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోలు చేపట్టిందన్నారు.

ఆ డబ్బులను నేటి నుంచి నేరుగా రైతులకు ఖాతాలలో జమ చేస్తామన్నారు. జగన్ బంగారు పాళ్యం పర్యటనలో మామిడి కాయలు పారబోసిన ఘటనపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్ ఓ ప్రాంతానికి రాగానే 5 ట్రాక్టర్లను సిద్ధం చేశారని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఐదు ట్రాక్టర్లు వైసీపీకి చెందిన వారివే… జగన్ రాగానే రోడ్డుపై మామిడి కాయలను వైసీపీ కార్యకర్తలు పారబోశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news