ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు చేయనుంది. జూలై 15వ తేదీన మరో రూ.3,600 కోట్ల అప్పు చేయనుంది ఏపీ ప్రభుత్వం. దీంతో దాదాపు లక్షన్నర కోట్లకు చేరింది ఏపీ కూటమి ప్రభుత్వ అప్పు.

ఇక అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీన మరో 2,500 కోట్లు అప్పు చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పరిమితిని మించి అప్పు కోరడంతో ప్రభుత్వ బాండ్లు వేలం వేయనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు కార్పొరేషన్ రుణాలు కలపకుండా రూ.1,84,900 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.