ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు త్వరలోనే నియామకాలను రూపొందించి ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 364 కోట్లను ఖర్చు చేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 15 లక్షల నుంచి రూ: 25 లక్షలు అందించబోతోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఏపీలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా అనేక రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఓవైపు రైతులకు, మరోవైపు విద్యార్థులకు, నిరుద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఏపీలో నిరుద్యోగితను తరిమికొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.