టాలీవుడ్ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చెందిన నేపథ్యంలో.. ప్రముఖ నటీనటులందరూ ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే బ్రహ్మానందం కూడా ఫిలింనగర్ లోని కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా…. కోట శ్రీనివాసరావు కు నివాళులు అర్పించి ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అటు కోట శ్రీనివాసరావు మృతి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు గారి మృతి సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
View this post on Instagram