Telangana: బీసీ బాలికల హాస్టల్ పై నుంచి దూకి 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బీసీ బాలికల హాస్టల్ పైనుండి దూకి ఐదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలోని జ్యోతిబాపూలే హాస్టల్‌లో నాలుగో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది ఐదవ తరగతి విద్యార్థిని సంధ్య.

crime
Class 5 student commits suicide by jumping from BC girls’ hostel

మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యను నిన్ననే హాస్టల్‌లో చేర్పించారు తలిదండ్రులు. తల్లిదండ్రులు బలవంతంగా జాయిన్ చేయించడంతో.. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దింతో తూప్రాన్‌పేటలోని జ్యోతిబాపూలే హాస్టల్‌లో విషాధ చాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news