అభిమానిపై రాజమౌళి సీరియస్…చావు దగ్గర సెల్ఫీ ఏంట్రా !

-

కోట శ్రీనివాసరావు నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులందరూ అక్కడికి విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి కోట శ్రీనివాసరావుకు నివాళులర్పించడానికి వెళ్లారు. తిరిగి రాజమౌళి ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడికి ఓ అభిమాని సెల్ఫీ కోసం రాజమౌళి వెంటపడ్డాడు. కారు వరకు అలాగే రాజమౌళి వెంట వెళ్తుండడంతో అతడు తీవ్ర అసహనానికి గురై అతడిని తోసేశారు.

rajamouli
rajamouli

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆ అభిమానికి కొంచెమైనా బుద్ధి ఉందా సమయం సందర్భం లేకుండా అక్కడ సెల్ఫీ అడగడం ఏంటి అని అంటుంటే… మరికొంతమంది అంత అసహనానికి గురవడం అవసరమా అని అంటున్నారు. మీరు అలా తోసేయడం ఎందుకు అభిమాని మీ వెంటపడినప్పుడు నెమ్మదిగా సమాధానం చెప్పొచ్చు కదా. అలా తోసేస్తే అతనికి ఏమైనా అవుతే పరిస్థితి ఏంటని ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news