Yadadri : సినీ ఫక్కీలో భర్తను హత్య చేసింది భార్య. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి మృతిచెందాడు. బైక్ పై వెళ్తున్న స్వామిని ఢీ కొట్టింది కారు. అయితే.. రోడ్డు ప్రమాదం ఘటన విచారణలో అసలు నిజం బయటపడింది.

కారును రెంట్ కు తీసుకుని భార్యే స్వామిని చంపించినట్లు గుర్తించారు పోలీసులు. స్వామి భార్యతో పాటు బావమరిది, సుపారి కిల్లర్స్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.