జాతీయ భాష హిందీ అంటూ లోకేష్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. జాతీయ భాష హిందీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే కొనసాగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందీ పెద్దమ్మ అయితే… తెలుగు అమ్మలాంటిది అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

Nara Lokesh stated in an interview to a media that Hindi is our national language.
Nara Lokesh stated in an interview to a media that Hindi is our national language.

అయితే ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా హిందీ విషయంలో దొరికిపోయారు. కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హిందీ మన జాతీయ భాష అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో లోకేశ్‌‌కు జాతీయ భాష అంశంపై అవగాహన లేదని విమర్శకులు మండిపడుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం హిందీకి అధికార భాష హోదా మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. దీనిపై సారీ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news