ఆంధ్రప్రదేశ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఏపీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెబుతూ.. కీలక ప్రకటన చేశారు. అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తానని మంత్రి డోల తాజాగా వెల్లడించారు.

సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో తాజాగా ఏపీ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అట్రాసిటీ బాధితులకు పరిహారం, పీఎం ఆదర్శ్ గ్రామ యోజన అలాగే లీడ్ క్యాప్ పై కూడా ఈ సందర్భంగా చర్చించి కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్య, ఆరోగ్యం అలాగే భద్రత అంశాలలో రాజీ పడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. గురుకులాలు అలాగే వసతి గృహాలలో మిగిలిన సీట్లు భర్తీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.