టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ పై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పొరుగింటి మహిళపై ఆమె దాడికి పాల్పడ్డారంటూ బిర్ భూమ్ జిల్లాలోని సూరి పోలీస్ స్టేషన్ లో మహమ్మద్ షమీ మాజీ భార్యపై కేసు నమోదు అయింది.

ఈ కేసుపై విచారణ కొనసాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ భవన నిర్మాణానికి సంబంధించి హసీన్ జహాన్ తన పొరుగింటి మహిళతో ఘర్షణకు దిగినట్లుగా వెళ్లడైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.