తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రూల్స్ బ్రేక్ చేసిన వారి ఇండ్లు రద్దు చేస్తామని… తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 1వ తేదీన మొగ్గుపోసి నిర్మాణం ప్రారంభించక పోతే ఆ ఇండ్లను రద్దు చేసే అవకాశం ఉందని పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచనలు చేశారు.

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి అలాగే ఎలుకతుర్తిలో.. మాధురి ఫోన్ నెంబర్ ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ ఇండ్లను కట్టడం ప్రారంభించాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డులు ఇస్తామని కూడా వెల్లడించారు.