VS Achuthanandan, Kerala’s grand old Communist leader: కేరళ తీవ్ర విషాదం నెలకొంది. కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతి చెందారు. గుండెపోటుతో గత నెల 23న ఆయన ఆస్పత్రిలో చేరారు 101 ఏళ్ళు ఉన్న కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు.

ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈయన 2006-2011 మధ్య కేరళ సీఎం గా పని చేశారు.