తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ నెలకు సంబంధించిన కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఊంజల్ సేవ టికెట్లు జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయని టీటీడీ తెలియజేసింది. అలాగే అంగప్రదక్షిణ టోకెన్లు జులై 23వ తేదీన విడుదల కానున్నాయి.

24వ తేదీ ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టోకెన్లు విడుదల అవుతాయి. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వర్షాకాలం అయినప్పటికీ భక్తులు ఏ మాత్రం ఆలోచించకుండా ఆలయానికి అధిక సంఖ్యలో పోటేత్తుతున్నారు.