దేశం కరోనా వైరస్ రూపంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ ను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అన్ని అంతర్జాతీయ విమానాల పై నిషేదం విధించిన కేంద్రం తాజా గా దేశీయ వాణిజ్య విమానాలను కూడా రద్దు చేసింది. కరోనా పై చేసే యుద్దం లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది మంగళవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తుంది అని కేంద్రం స్పష్టం చేసింది.
ఐతే కార్గో విమానాలకు మాత్రం ఇందుకు మినహాయింపు. అయితే మనదేశంలో ఇప్పటికి 457 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కొలుకోగా, 415 చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ బారిన పడి 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కరోనా 80 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించారు. 19 రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్ ప్రకటించాయని కేంద్రం తెలియజేసింది.
ఈ పరిస్థితిని ప్రజలు కొంచెం సీరియస్‌గా తీసుకోవాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు గుంపులుగా బయట తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి కి కారణం మనమే అవుతామని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించి కరోనా ను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగం కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పిలుపు ఇచ్చింది.