తెలంగాణా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు వారి ముందు ఉంది. ఊహించని విధంగా కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణాను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడిక్కడ తెలంగాణాలో కరోనా వైరస్ విస్తరిస్తుంది.
తెలంగాణా ఆంధ్రా సరిహద్దుల్లో కరోనా వైరస్ బయటపడుతుంది. తెలంగాణకు అత్యంత సమీపంలో ఉన్న చింతలపూడి మండలంలో రాఘవాపురం గ్రామంలో కరోనా వైరస్ వ్యాపించింది. అక్కడ కరోనా వస్తుంది అని ఎవరూ ఊహించలేదు. అక్కడి నుంచి ఎక్కువగా సమీపంలో ఉన్న సత్తుపల్లికి ఎక్కువగా వస్తు ఉంటారు. ఆంధ్రా సరిహద్దు అయినా తెలంగాణాతోనే వాళ్లకు ఎక్కువగా సంబంధాలు ఉంటాయి. ఇక అదిలాబాద్ జిల్లా వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.
, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి ఎక్కువగా ప్రజలు వ్యాపారం కోసం వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం. మెదక్ జిల్లా వాసులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎటు నుంచి మహమ్మారి వస్తుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అందరికి ఉంది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు. అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఉంది. కాబట్టి నల్గొండ వాళ్ళు, ఖమ్మం జిల్లా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా అప్రమత్తంగా ఉండాలి.