సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని నినాదం జై తెలంగాణ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక్క నినాదం ‘జై తెలంగాణ’ అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సినీ హీరోలు అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ కూడా ‘జై తెలంగాణ’ అని నినాదం చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని ఎన్నడూ అనడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సు కు హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  బనకచర్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Harish Rao

రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలుచుకుంటాడని.. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేడని తెలిపారు. మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరే రాజీనామా చేయకుండా పారిపోయారని తెలిపారు. రేవంత్ రెడ్డి తన రాజీనామాను జీరాక్స్ పేపర్ మీద ఇచ్చారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news