దమ్ముంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి : ఆది శ్రీనివాస్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas) తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం రమేష్ ఇంటికి వెళ్లి బీజేపీలో బీఆర్ఎస్ ను కలుపుతామని చెప్పినమాట నిజమో కాదో కేటీఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేసారు. కవితపై ఉన్న కేసులు కొట్టివేస్తే తమ పార్టీని విలీనం చేస్తామని సీఎం రమేష్ తో కేటీఆర్ అన్నారని.. కానీ  బీఆర్ఎస్ ఒక అవినీతి పార్టీ అని, అలంటి పార్టీతో పొత్తు అక్కర్లేదని ఆ పార్టీ పెద్దలు పక్కన పెట్టారని తెలిపారు.

Adi Srinivas

కొన్ని సామజిక వర్గాలను కేటీఆర్ తిట్టినట్టు కూడా రమేష్ చెప్పారని.. దమ్ముంటే కేటీఆర్ నిజాలు బయటపెట్టాలని.. సీఎం రమేష్ అడిగిన ప్రషన్లకు కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేసారు. తెలంగాణ అనే పదాన్ని తొలగించి భారత అని చేర్చుకున్నపుడే ఆ పార్టీకి తెలంగాణతో బంధం తెగిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతామని సోనియా గాంధీకి ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చింది వాస్తవమో కాదో చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news