లంగ్స్ లోకి ప్రవేశించగానే కరోనా ఏం చేస్తుందో చూడండి !

-

కరోనా వైరస్ బారిన పడిన వారిలో చాలామంది ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. మామూలుగా జ్వరం మరియు దగ్గు అదేవిధంగా జలుబు తో మొదలయ్యే ఈ లక్షణాలు క్రమంగా న్యుమోనియా లాగ మారి ప్రాణాలను తీస్తుంది. ఎక్కువగా ఈ వైరస్ ప్రభావం ఊపిరితితులపై అనగా లంగ్స్ లోకి ప్రవేశించి కోవిడ్- 19 వల్ల శ్వాస తీసుకోవడంలో రోగి తీవ్ర ఇబ్బందులకు గురై మరణిస్తాడు. మొదటి నాలుగు రోజులు ప్రభావం చూపి తర్వాత 9 రోజులు గడిచేసరికి ఊపిరి అందకుండా చాలా కష్టతరం చేస్తుంది. దీంతో కొందరిలో అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉండటంతో శ్వాస తీసుకోవటంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. Image result for caroona virus working in lungsవైరస్ సోకిన వ్యక్తి  కోవిడ్ 19 స్టేజీకి వచ్చాడంటే అతని ప్రాణం స్మశానం మొదటి లో ఉన్నట్టే. తీవ్ర ప్రభావం శ్వాస తీసుకోవడానికి ఈ కోవిడ్ 19 మనిషిని ముప్పుతిప్పలు పెడుతుంది. ఆ తరువాత రక్తంలోకి చేరి అత్యంత ప్రమాదకరమైన స్థితికి వారి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఆ తర్వాత ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయటంలో వైరస్ సోకిన వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి టైమ్లో రోగిని కాపాడుకోవడానికి అత్యంత జాగ్రత్త వహించాలి.

 

అంతేకాకుండా icu లో ఉంచి చికిత్స అందించాలి. అప్పటికి కూడా రోగనిరోధక శక్తి లేకపోతే ఇంకేం చేయలేని పరిస్థితి. వైరస్ సోకిన వ్యక్తికి రోగనిరోధక శక్తి బాగా ఉండి ఉంటే…ఖచ్చితంగా వైరస్ నిర్మూలించవచ్చు. ఇదిలా ఉండగా ఈ వైరస్ ఎక్కువగా 60 వయసు పైబడిన వాళ్ళపై అలాగే పది సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు ఎక్కువ ప్రమాదకరంగా ప్రభావం చూపుతోంది. ఈ విధంగా లంగ్స్ లోకి ప్రవేశించగానే కరోనా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఎవరికి వారు ప్రభుత్వం చెబుతున్న ఆదేశాలను పాటించి ఇంటిలోనే ఉండాలని…లేకపోతే బయటకు వస్తే ఇంటిలో ఉన్న పెద్ద వాళ్ళు మరియు చిన్న పిల్లల ప్రాణాలను తీసిన వారం అవుతామని చాలామంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news