Naini Rajender Reddy Counter to KTR: సీఎం రమేష్ వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానన్న మాటలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని ఫైర్ అయ్యారు.

ఈ అంశంపై సొంత చెల్లి కవిత విభేదించడం కన్నా పెద్ద సాక్ష్యాలు కావాలా? అని ఆగ్రహించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అటు కేటీఆర్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజల సమక్షంలో తేల్చుకుందామని పేర్కొన్నారు నాయిని. తాను చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు.