ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో, ఒత్తిడి, కోపం అనేవి సర్వసాధారణమైన సమస్యలుగా మారిపోయాయి. ఈ రెండు మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాక రోజువారి మనం చేసే పనులలో కూడా ఎన్నో ఆటంకాలను సృష్టిస్తుంటాయి. అయితే కొన్ని సాధారణ మార్గాల ద్వారా మనసుని నిగ్రహంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మరి అలాంటి మార్గాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం..
ధ్యానం చేయటం: మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే, మనకి ముఖ్యంగా కొంత టైం కావాలి మన గురించి మనం ఆలోచించుకోవడానికి మన కోసం మనం కనీసం ఒక 30 నిమిషాలు కేటాయించుకోవాలి. ఆ టైంలో మనం ధ్యానం చేయడం వ్యాయామాలు చేయడం వల్ల, మనసు ప్రశాంతంగా మారుతుంది. ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు కేవలం రోజుకి 10 నుంచి 15 నిమిషాల పాటు శ్వాస పైన దృష్టి పెట్టి ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై ప్రశాంతత చేకూరుతుంది.
శారీరక వ్యాయామం : మనిషి శరీరానికి ఎక్సర్సైజ్ ఎంతో ముఖ్యం. మనం చేసే వ్యాయామం మన ఒత్తిడిని కోపాన్ని తగ్గించడంలో దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. శరీరం చురుగ్గా ఉన్నప్పుడు ఎండార్పిన్ హార్మోన్ విడుదలవుతుంది ఇది మన మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. రోజుకి 20 నిమిషాల పాటు నడక లేదంటే, యోగ, జాగింగ్ లేదా డాన్స్ చేయడం,ఇలా రోజు వ్యాయామం చేయడం అలవాటు ఐతే శరీరంలో ఒత్తిడి తగ్గి మనసు నిగ్రహంగా మారుతుంది.
పాజిటివ్ థింకింగ్ : ఇప్పుడున్న జనరేషన్ లో ఎక్కువమంది చేస్తున్న పొరపాటు ప్రతి చిన్న సమస్యని నెగిటివ్గా ఆలోచించి మనసుపై ఒత్తిడిని పెంచుకుంటున్నారు. ఒక ప్రాబ్లం మనకి వస్తే పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టాలి మన ఆలోచనలు మన మనసుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అందుకే పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేసుకోవాలి.
డైరీ రాయడం: ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలియని పని ఏదైనా ఉందంటే అది డైరీ రాయడమే, నిజంగా ఆలోచిస్తే గత జనరేషన్ వరకు డైరీ రాసేవారు ఇప్పుడు అంటే ఫోన్ వచ్చాయి.కానీ డైరీ రాయడం వలన ఎన్నో లాభాలు వున్నాయి. కృతజ్ఞత భావం పెరగాలంటే మనం ఎవరికైనా సారీ చెప్పాలన్న థాంక్స్ చెప్పాలన్న ఒక్కొక్కసారి చెప్పడం వీలు కాకపోవచ్చు, చెప్పలేదని మనం మనసుపై ఎంతో ఒత్తిడి తెచ్చుకుంటాము. అదే డైరీ రాసే అలవాటు ఉంటే ఆ రోజు రాత్రి పడుకునే ముందు ఒక పది నిమిషాలు కేటాయించి ఆ రోజు జరిగినవన్నీ గుర్తు చేసుకోవడం ఎవరికి సారీ చెప్పాలనుకున్న ఎవరికి థాంక్స్ చెప్పాలనుకున్నాం అనేది పేపర్ పై రాస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది.
మంచి ఆహారం: ఆహారం మన మానసిక స్థితిపై భాగం చూపుతుంది అనారోగ్యకరమైన ఆహారం తింటే ఒత్తిడి కోపం పెరుగుతుంది అయితే సమతుల్యమైన ఆహారం ప్రోటీన్లు, విటమిన్స్ కలిగిన ఆహారం తీసుకుని కెఫేన్,చక్కెరకు దూరంగా, రోజూ తగినంత నీరు త్రాగుతూ, శరీరాన్ని కాస్త వ్యాయామంతో ముందుకు నడిపిస్తే,ఒత్తిడి జయించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి, మెగ్నీషియం ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
Note: (ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మానసికమైన, శారీరకమైన సమస్యలు ఎదురైనప్పుడు వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యం)