నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నిన్న కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ రవీందర్ రావు దీనికి హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, సీఎం రమేశ్ వ్యాఖ్యలపై సుదీర్ఘ చర్చలు జరిగాయట.

నిన్న BRS అధినేత కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి.. కీలక అంశాలపై చర్చించారట. 10 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కొనసాగింది. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ ఉన్నారు. ఇవాళ కూడా కేసీఆర్ తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఈ నెలలో కరీంనగర్ లో నిర్వహించే బీసీ సభపై చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అనేదానిపై సమాలోచన చేస్తున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ ఆదేశం ఇచ్చారు.