వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో దాయాది పాకిస్థాన్ (Pakistan)తో ఆడేందుకు భారత India) మాజీ క్రికెటర్ల నిరాకరించిన విషయం విదితమే. ఇందులో భాగంగా టోర్నీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో పాటు సెమీఫైనల్ మ్యాచ్లను భారత్ చాంపియన్స్ జట్టు రద్దు చేసుకుంది. హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో తలపడాల్సి వస్తే అది ఫైనల్ అయినా సరే అదే నిర్ణయాన్ని తీసుకుంటామని భారత రిటైర్డ్ ప్లేయర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి నుంచి ‘ప్రైవేటు మ్యాచ్ లకు ‘పాకిస్థాన్’ పేరు వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ లో
అంతర్జాతీయ మ్యాచ్లను మినహాయించి ఆడబోయే ప్రతి ప్రైవేటు లీగ్ లకు ఈ నిబంధన వర్తిస్తుందని పీసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల ఆ దేశ మాజీ ప్లేయర్లు షాక్కు గురయ్యారు. దేశం ఐడెంటిటీ లేకుండా మ్యాచ్ లో ఆడటం ఏంటని ఫైర్ అవుతున్నారు.