బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు వివిధ అంశాలపై మాట్లాడిన అంశాలను ప్రస్తావిస్తూ మరో సంచలన సెటైరికల్ ట్వీట్ చేశారు. కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వేర్వేరు సమావేశాల్లో పాల్గొన్న వీడియోలను ట్యాగ్ చేస్తూ.. బేసిjh తెలియదు. బేసిక్స్ తెలియదు. బనకచర్ల కట్టింది లేదు అనేది కూడా తెలియదు.
వారిద్దరికీ సరుకు లేదు, సబ్జెక్టు రాదు, అంత శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరు జాతిరత్నాలే. రాష్ట్రానికి న్యాయకత్వం వహిస్తున్న వీళ్ళ తెలివే ఇట్లా ఉంటే.. వీళ్ళు ఎలా తెలంగాణ రైతులకు న్యాయం చేస్తారు..? జాగో తెలంగాణ సోదరులారా అంటూ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు కేటీఆర్. మరోవైపు మహేశ్ కుమార్ గౌడ్ కూడా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.