బనకచర్ల చాప్టర్ క్లోజ్.. లోకేష్ పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ నీటి ప్రాజెక్టుల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మాట్లాడారు. “నా ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు. కానీ, ఎప్పటినుంచో నా నంబర్ అదే ఉంది. దాన్నే కొనసాగిస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కమిషన్ నివేదికపై కేబినేటలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్  వ్యవహారాల్లో ఏం జరగాలో అదే జరుగుతుంది.

Komatireddy

బనకచర్ల చాప్టర్ క్లోజ్. బనకచర్లని నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం. లోకేష్ లాంటి చిన్నపిల్లోడి వ్యాఖ్యలపై నేను మాట్లాడను. డిండి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలకు లైనింగ్ ఏడాదిలోనే పూర్తిచేస్తాం అని తెలిపారాయన. రైతు భరోసా వంద ఎకరాలు ఉన్నవారికి కూడా ఇచ్చాం. ఎంజీ యూనివర్శిటీలో నూతన బిల్డింగులను నిర్మిస్తాం. నార్కట్ పల్లి పెద్ద చెరువును వేణుగోపాలస్వామి పేరుతో మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తాం. క్యాంపు కార్యాలయానికి ఇందిరా భవన్ గా నామకరణం చేస్తున్నాం. బీఆర్ఎస్ లో ఐదు గ్రూపులు ఉన్నాయి. కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్ గ్రూపులు నడుపుతున్నారు. బీసీలకు కవితకు ఏం సంబంధం. గత పదేళ్లు ఆమెకు బీసీలు గుర్తుకురాలేదా?. బీఆర్ఎస్ పార్టీ అనేదే భవిష్యత్తులో ఉండదు. దాని గురించి నేను మాట్లాడను అని కోమటిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news