శ్రావణమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు అత్యంత పవిత్రమైన రోజు, ఈ రోజున శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని భవిష్య పురాణంలో వివరించబడింది. శ్రావణ మాసంలో పెళ్లిళ్లకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అలానే నోములకి, వ్రతాలకి, ప్రత్యేకమైన పూజలకి, అంతే ప్రాముఖ్యత ఇస్తారు.
హిందూ ఆచారాలలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఈ శ్రావణమాసంలో ఆగస్టు-5న పుత్రదా ఏకాదశి గా చెప్పుకుంటారు. ఈరోజు భక్తిశ్రద్ధలతో పిల్లలు లేని జంట పూజలు చేస్తే, వారికి సంతానం కలుగుతుందని హిందువుల నమ్మకం.కొత్తగా పెళ్లయిన దంపతులు, పుత్రద ఏకాదశి వ్రతం చేయడం వలన, పిల్లలు పుట్టడమే కాకా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. ఈ వ్రతం సంతానం కోసం చేసే వ్రతం అని పురాణాలు చెబుతున్నాయి. దంపతులు భక్తితో, నియమనిష్ఠలతో చేసుకోవాలి పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరిస్తే, సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు భక్తుల కోరికలను తీర్చే, వరప్రదాతగా ఆరాధిస్తారు. (ఆగస్టు 5) రేపు శుద్ధ ఏకాదశి, ఈ రోజున ఉపవాసం, పూజ జపం, జాగారం వంటివి చేయడం ద్వారా సంతానం కలుగుతుందని అలాగే మోక్ష ప్రాప్తి కూడా సాధ్యమవుతుందని భక్తులు నమ్మకం. భవిష్య పురాణంలో మహీజిత్ అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పొందినట్లు పేర్కొనబడింది.
శ్రావణ ఏకాదశి కథ : భవిష్య పురాణం ప్రకారం మహాజిత్ అనే రాజు సంతానం లేక బాధపడుతూ, ఎన్నో పూజలు చేసిన ఫలితం లేక రాజ్యం విడిచి అడవులకు వెళ్ళాడు. అక్కడ తపం ఆచరిస్తున్న మహర్షి సలహాతో శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆయన భార్యతో కలిసి నిష్టగా ఉపవాసం పూజలు చేయడం ద్వారా సంతానాన్ని పొందాడు. ఈ వ్రతం ఆచరించిన దంపతులకు సంతాన ప్రాప్తి సౌభాగ్యం ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం.

ఏకాదశి ముందు రోజు అంటే దశమి సాయంత్రం నుండి నిరాహారంగా ఉండాలి ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. మరుసటి రోజు ఆగస్టు 5 2025 నాడు పూర్తి ఉపవాసం పాటించి, పూజ చేసుకోవాలి.ఎవరైనా పెద్దవారు లేదా ఏదైనా ఆరోగ్య కారణాల వలన ఉపవాసం సాధ్యం కాని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు. ధాన్యాలు, పప్పులు ఉల్లిపాయ, మాంసాహారం వంటివి తీసుకోకూడదు. ఇక విష్ణుమూర్తి ఆరాధన తర్వాత ఈ పూజ గావించి విష్ణు సహస్రనామం విష్ణు స్తోత్రాలు పటించి జాగరణ చేయాలి. ఉపవాసాన్ని ద్వాదశి ఘడియలు ముగిసేలాగా విరమించాలి.
శ్రావణ పుత్రుదా ఏకాదశి వ్రతం కొత్తగా పెళ్లైన దంపతులకు సంతాన ప్రాప్తి, సౌభాగ్యం కలిగించే పవిత్రమైన వ్రతం. శ్రీ మహా విష్ణువు, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ ఆగస్టు-5 2025 నాడు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి తత్ ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం.