భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన ఆరోగ్య భీమా పథకం. ఆయుష్మాన్ భారత్ పథకం ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారికి, ఉచిత వైద్య సహాయం అందించడానికి రూపొందించారు. ఈ పథకం 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఎన్నో లక్షల కుటుంబాలు ఆరోగ్య భీమాను పొందుతున్నాయి. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పథకం ముఖ్య ఉద్దేశం: దేశంలోని దాదాపు 12 కోట్ల పేద కుటుంబాలకు, సుమారు 50 కోట్ల మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం ముఖ్య లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించారు. ప్రధానంగా వైద్య సంరక్షణతో పాటు ఆసుపత్రి ఖర్చులను కూడా కవర్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ రోజుల్లో హాస్పిటల్ కి వెళ్లడం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం ఎంతో డబ్బులను ఖర్చు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులలో, చిన్న చిన్న సమస్యలకే వేళల్లో వసూలు చేయడం మనం గమనిస్తున్నాం. ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. 70 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజెన్ కు ప్రత్యేకంగా ఆరోగ్య కవరేజ్ అందించడం జరుగుతుంది.
తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 77.19 లక్షల కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ అందుతుంది అయితే ఆయుష్మాన్ భారత్ కింద 26.11లక్షల కుటుంబాలకు మాత్రమే అర్హులుగా ఉన్నారు. ఈ పథకం దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందుతుంది. వయసు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరూ ఆదాయపరిమితి లేకుండా అర్హులుగా భావించవచ్చు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.2 లక్షల వరకు కవరేజ్ అందుతుంది, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల వరకు కవరేజ్ అందుతుం.ది ఈ రెండు పథకాలు అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది.
పథకం ప్రయోజనాలు: ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య భీమా ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ చికిత్సలు మందులు, పరీక్షలు, ఫ్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి. అంటే ఏదైనా ఒక ఆపరేషన్ కి ముందు మూడు రోజులు తర్వాత 15 రోజులు అయ్యే ఖర్చులన్నీ కూడా ఈ పథకం కింద కవర్ చేయబడతాయి. సుమారు 1400 రకాల వైద్య ప్రక్రియలు ఇందులో పొందవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు వంటివి ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో, ఈ పథకం కింద చికిత్స చేయబడుతుంది. 70 ఏళ్ళు పైబడిన వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులను కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కింద ఏడాదికి ఒక కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. ఇక 83 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరింది.
ఆయుష్మాన్ కార్డు పొందడానికి, అధికారిక వెబ్సైట్ pmjay.gov.in లేక ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.