ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. జైళ్ళ శాఖలో పోస్టులు భర్తీపై కీలక అప్డేట్ వచ్చింది. జైళ్ల శాఖలో వార్డెన్ పోస్టుల భర్తీ చేపట్టాలని ఏపీ హోం మంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. జైల శాఖలో ఖాళీగా ఉన్న 300 నుంచి 400 వార్డెన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

జైళ్లలోని పరిశ్రమలకు టెక్నాలజీ జోడించి అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జైల శాఖ అధికారులతో ఆమె సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టులను భర్తీ చేయాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు ఏపీ హోం మంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిన జైళ్ళ భవనాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని అలాగే కొందరు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.