తెలంగాణలో చనిపోయిన 28 వేల మందికి పెన్షన్ ఇస్తూ భారీగా అవినీతి పాల్పడ్డారట. ఈ మేరకు రికవరీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం కాలంలో చనిపోయిన 28 వేల మందికి రూ.60 కోట్ల వరకు పెన్షన్ జమ చేసింది. అధికారులతో కుమ్మక్కై, చనిపోయిన వారికి పెన్షన్లు విడుదల చేస్తూ డబ్బులను దోచుకుంటోందట సిబ్బంది.

సాధారణంగా పెన్షన్ తీసుకునే వారిని 3 నెలలకు ఒకసారి చెక్ చేస్తూ ఒకవేళ చనిపోతే వారి పేరును తొలగించి పెన్షన్లు నిలిపివేయడం సాధారణంగా ప్రక్రియ జరుగుతోంది. కానీ గత సంవత్సరంలో చనిపోయిన 28 వేల మంది చనిపోయిన వారికి పెన్షన్లు ఇచ్చింది. దీంతో ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.