ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రేపటి నుంచి ఉచిత విద్యుత్ అందించేందుకు రంగం సిద్ధం చేసింది. చేనేతలకు భరోసా ఇచ్చేందుకు మగ్గాలకు 200 యూనిట్లు అలాగే పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి వీటిని అమలు చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. దీంతోపాటు చేనేత వస్త్రాలపై జీఎస్టీ ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్మికుల కోసం ఐదు కోట్లతో ట్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.