ప్రేమ గుడ్డిది అనే సామెత చాలామందికి తెలుసు. కొంతమంది ఎలా ఉన్నా సరే ప్రేమ అనే ఒకే ఒక్క మాటతో మాయలో పడిపోయి బతుకుతారు. ప్రేమ కోసం ఏమైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు. నేటి కాలంలో ప్రేమ కోసం ఎన్నో సాహసాలు, హత్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొంతమంది వికలాంగులను సైతం ప్రేమించి వివాహం చేసుకుంటారు. అలాంటి సమయంలో ప్రేమ గుడ్డిది అని చాలామంది అంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ రోగిని ప్రేమించి చివరకు డాక్టర్ బలైంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ సనత్ నగర్ లో భర్త వేధింపులకు సైకాలజిస్ట్ రజిత బలైంది. ఆసుపత్రిలో ఇంటర్న్ గా పనిచేస్తున్న సమయంలో మానసిక రోగిగా వచ్చిన రోహిత్ అనే వ్యక్తిని మామూలు మనిషిగా మార్చింది. రోహిత్ లవ్ ప్రపోజ్ చేయడంతో అతడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత రోహిత్ జాబ్ మానేసి తన జీవితంతో జల్సాలు చేస్తుండడంతో మారాలని చాలా బతిలాడింది అయినా అతడు వినలేదు. డబ్బు వేధింపులు పెరగడంతో తట్టుకోలేక జులై 28వ తేదీన ఇంటి పైకప్పు నుంచి దూకింది. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ఇన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆ మహిళ నిన్న బ్రెయిన్ డెడ్ తో మృతి చెందింది. తమ కూతురి మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.