‘ది రాజా సాబ్ 2’ పక్కా.. కానీ సీక్వెల్ కాదు !

-

 

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాకు పార్ట్-2 విశ్వప్రసాద్ వెల్లడించారు. అయితే పార్ట్-2 జోనర్ వేరే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అనేక రకాల ప్రచారాలు వస్తున్నాయి. జనవరి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయమని అభి మానులు ఎంతగానో కోరుతున్నారని నిర్మాత వెల్లడించారు.

TheRajaSaabOnDec5th
TheRajaSaabOnDec5th

డిసెంబర్ నెలలో అయితే రాజా సాబ్ సినిమా హిందీ మార్కెట్ కు అనుకూలిస్తుందని అన్నారు. ఈ విషయం గురించే చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. కాగా, రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ అవుతుందని ఇది వరకే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news