వానాకాలంలో బట్టలు చెడ్డ వాసన రాకుండ వుండటానికి ఈ చిట్కాలు పాటించండి!

-

వానాకాలంలో ఎప్పుడు వాతావరణం తేమ గా వుంటుంది.దాని వలన బట్టలు తడిగా వుండి చెడ్డ వాసన రావడం జరుగుతుంది.ఈ సమస్య అందరి ఇంట్లో వుండేది.ఈ తేమతో కూడిన వాతావరణంలో బట్టలు ఆరకపోవడం, వాసన రావటం, బూజు పట్టడం వంటివి జరుగుతాయి. అయితే కొన్ని సాధారణ చిట్కాలతో ఈ సమస్యను నివారించవచ్చు. బట్టలను వాసన లేకుండా తాజాగా ఉంచే కొన్ని సులభమైన చిట్కాలు తెలుసుకుందాం.

బట్టలను సరిగ్గా ఆరబెట్టండి: వానాకాలంలో బట్టలు ఆరబెట్టడం పెద్ద సవాలు. బట్టలు ఆరవెయ్యడానికి గాలి బాగా తగిలే చోట చూడాలి. ఇంట్లో ఫ్యాన్ కింద లేదా డీహ్యూమిడిఫైయర్ ఉన్న గదిలో బట్టలను ఆరబెట్టండి. బట్టలను ఒకదానిపై ఒకటి ఉంచకుండా, ఖాళీగా వేలాడదీయండి. ఇది తేమను తగ్గించి, చెడ్డ వాసన రాకుండా చేస్తుంది.

వాషింగ్ మెషిన్‌ను శుభ్రంగా ఉంచండి: వాషింగ్ మెషిన్‌లో తేమ నిలిచిపోతే, అది బట్టలకు చెడు  వాసనను అంటించవచ్చు. ప్రతి నెలా వాషింగ్ మెషిన్‌ను వేడి నీటితో, వెనిగర్ లేదా బేకింగ్ సోడాతో శుభ్రం చేయండి. ఉతికిన తర్వాత బట్టలను వెంటనే తీసి ఆరబెట్టండి, ఎక్కువసేపు మెషిన్‌లో ఉంచవద్దు.

No More dusty Smell in Clothes This Rainy Season – Follow These Tricks!

సహజ డిటర్జెంట్ల వాడకం: సహజ డిటర్జెంట్లు లేదా మంచి సువాసన వచ్చే లిక్విడ్‌లను ఉపయోగించండి. ఉతికే నీటిలో కొన్ని చుక్కల లావెండర్, టీ ట్రీ ఆయిల్ కలపడం వల్ల బట్టలు తాజాగా ఉంటాయి. కాస్త కర్పూరం కలిపినా నీటిలో బట్టలను ఉంచిన అవి వాసన రావు.

బట్టల భద్రపరచడం:బట్టలను అల్మరాలో ఉంచే ముందు పూర్తిగా ఆరినట్లు నిర్ధారించుకోండి. అల్మరాలో సువాసన కలిగిన కలరా వుండల ప్యాకెట్లు లేదా సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచండి. ఇవి తేమను గ్రహించి, బట్టలను బూజు నుండి కాపాడతాయి. అలాగే, లావెండర్ ను అల్మరాలో ఉంచడం వల్ల బట్టలకు ఆహ్లాదకరమైన వాసన వస్తుంది.

ఇంటి చిట్కాలు : వర్షకాలం లో ఎప్పుడు ఇంట్లో తేమ గానే ఉంటుంది. ఇంట్లో తేమను తగ్గించడానికి డీహ్యూమిడి ఫైయర్ లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించండి. గదులను గాలి ఆడేలా ఉంచండి. బూట్లు, బట్టలు ఉంచే ప్రదేశాలలో కర్పూరం ఉంచండి. ఇలా చేయటం వలన వానాకాలం లో బట్టలు చెడు వాసన రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news