లంచం తీసుకోవడం ఉద్యోగులకు బాగా అలవాటు అయిపోయింది. కొంతమంది లంచం తీసుకుంటుండగా దొరికిపోయి ఉద్యోగాలు కోల్పోయిన కూడా చాలామంది ఉద్యోగస్తులు భయపడడం లేదు. దొంగచాటుగా లంచాలు తీసుకోవడం ఏమాత్రం ఆపడం లేదు. వారికి జీతాలు వచ్చినప్పటికీ సామాన్య మానవుల వద్ద చిన్న చిన్న పనుల కోసం విపరీతంగా లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ఓ వ్యక్తి లంచం తీసుకుంటుండగా దొరికిపోయాడు.

ఏకంగా రూ. 25 లక్షల రూపాయల లంచం తీసుకొని పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… సబ్బవరపు శ్రీనివాస్ మూడు వారాలలో రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. అయితే అతడు కొడితే జాక్పాట్ కొట్టాలని ఇదే ఆఖరి అవకాశం అనుకున్నారు. ఓ సంస్థకు రూ. 35 కోట్ల బిల్లుల మంజూరు కోసం గిరిజన సంక్షేమ శాఖ ENC సబ్బవరపు శ్రీనివాస్ రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. ఆ సంస్థ ఫిర్యాదుతో ట్రాప్ చేసిన ACB రూ. 25 లక్షల టోకెన్ అమౌంట్ తీసుకుంటుండగా విజయవాడలో పట్టుకుంది. గతంలోనూ ఈ వ్యక్తి రెండుసార్లు పట్టుబడినప్పటికీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు. ACB చరిత్రలోనే ఇదే అతి పెద్ద ట్రాప్ గా నిలిచింది.