నేటి కాలంలో వివాహం కోసం చాలామంది వారి మతం దాచి వివాహం చేసుకుంటున్నారు. అనంతరం మత మార్పిడి కోసం చాలా రకాల గొడవలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ విషయం పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మతాన్ని దాచి వివాహం చేసుకునే వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హరియానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మతమార్పిడికి పాల్పడినట్లయితే కఠినమైన శిక్షలు ఉంటాయని వెల్లడించింది. వివాహం కోసం మతం మార్చుకోవాలని అడిగినా కూడా రూ. 4 లక్షల జరిమానా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తామని స్పష్టం చేసింది. మత స్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం అసలు కాదని చెప్పింది. ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యం అని ప్రభుత్వం తెలియజేసింది. చట్టబద్ధంగా అనుమతి పొందిన తర్వాతే మతమార్పిడి వివాహాలు చేసుకోవాలని హరియానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.