ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం దుకాణాలలో ప్రభుత్వ పెద్దల ఫోటోలు దర్శనమిచ్చాయి. ఈ సంఘటన సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మద్యం దుకాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అటు హోం మంత్రి అనిత ఫోటోలు దర్శనమిచ్చాయి. సూళ్లూరుపేట ప్రధాన రహదారిపై ఉన్న ఆంధ్ర వైన్ షాప్ లో ఈ దృశ్యం బయటకు వచ్చింది. ఇంతవరకు గవర్నమెంట్ ఆఫీస్, స్కూల్స్ అలాగే ఆసుపత్రులలో ఈ ఫోటోలు కనిపించాయి. ఇక ఇప్పుడు వైన్ షాప్స్ లో కూడా ప్రభుత్వ పెద్దల ఫోటోలు కనిపించడం చూస్తున్నాం. ఇలాంటి సంఘటన గతంలో ఎన్నడూ జరగలేదన్న సంగతి తెలిసిందే.
వైన్ షాప్‌కు చేరిన సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు
సూళ్లూరుపేట ప్రధాన రహదారిపై గల ఆంధ్ర వైన్‌షాప్‌లో దృశ్యం
ఇంతవరకు గవర్నమెంట్ ఆఫీస్, స్కూల్స్, హాస్పిటల్స్‌లోనే కనిపించిన ఫొటోలు
ఇప్పుడు వైన్షాపుల్లోనూ దర్శనమివ్వడంతో ఆశ్చర్యంలో ప్రజలు.. వీడియో వైరల్ pic.twitter.com/8EuJwgqEks
— Telugu Feed (@Telugufeedsite) August 11, 2025