ఏపీ ప్రజలకు అలర్ట్.. ఏపీలో ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఏపీ మహిళలకు “స్త్రీశక్తి” పథకంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. కాగా, ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ లలోనే ఉంటుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఐడి కార్డును చూపించి బస్సులలో ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేశారు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి (తిరుమల), అల్ట్రా డీలక్స్, ఏసీ బస్సులు, స్టార్ లైనర్ బస్సులలో ఈ స్కీమ్ వర్తించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ మాదిరిగానే ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఏపీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.