పులివెందులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. బయటి నియోజకవర్గాల నుంచి టిడిపి కార్యకర్తలు వచ్చి వైసిపి ఏజెంట్లపై దాడులు చేస్తున్నారని అవినాష్ రెడ్డి అన్నారు. నేను ప్రశాంతంగా ఇంట్లో ఉండి నా పని నేను చేసుకుంటే నన్ను దౌర్జన్యంగా అరెస్టు చేశారు. కొత్తపల్లిలో వైసిపి ఏజెంట్లపై దాడి చేశారని అవినాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా ఎన్నికలను జరుపుతున్నారు.

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా వరస్ట్ పోలీసింగ్ ఉంది అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా…. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో అతడిని ఓడించేందుకు టిడిపి నేతలు ప్లాన్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి అన్నారు. గ్రామాలలో టిడిపి నేతలు డబ్బులు పంచుతున్నారని స్పష్టం చేశారు. డబ్బులు ఇచ్చి మరి ఓటర్ స్లిప్పులను తీసుకున్నారని తీసుకున్న స్లిప్పులతో దొంగ ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అవినాష్ రెడ్డి చేసిన ఈ కామెంట్లపై టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు.