Rythu Bima Scheme: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. రైతు బీమాపై కీలక అప్డేట్ వచ్చింది. రైతులు అకాల మరణం పొందితే బాధిత కుటుంబానికి బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఇవే…!

జూన్ 5లోపు రైతు పట్టా పాస్ బుక్ పొంది ఉండాలి. 18-59 సంవత్సరాల వయస్సు ఉండాలి. రైతుదారు తప్పకుండా ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, దరఖాస్తు ఫారం, నామిని ఆధార్ కార్డు కలిగి ఉండాలి. రూ. 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి (ఆగస్టు 13) రేపే చివరి తేదీ. రైతు వేదికల్లో ఏఈఓలకు అప్లికేషన్ సమర్పించాలి.