భారీ వర్షాలకు వరంగల్ రైల్వే స్టేషన్ నీట మునిగింది. రైల్వే ట్రాక్ పైకి భారీగా నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. దింతో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి.

కాశీబుగ్గ, రంగశాయిపేట, కరీమాబాద్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతుకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో షాపులు, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దింతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యావరేజ్‌గా 92.9 మి.మీగా వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా సంగెంలో 202.4 మి.మీ గా నమోదవ్వగా, ఖిలా వరంగల్ ప్రాంతంలో 148.5 మి.మీ, వర్ధన్నపేటలో 93.3 మి.మీ, పర్వతగిరిలో 107.5 మి.మీగా నమోదు అయింది వర్షపాతం.
భారీ వర్షాలకు నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్
రైల్వే ట్రాక్ పైకి భారీగా నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం pic.twitter.com/IW6MjqEnM1
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025