అశ్వగంధ ఆయుర్వేదంలో ప్రసిద్ధమైన ఔషధ మొక్క. శరీర బలాన్ని పెంచడం, ఒత్తిడిని తగ్గించడం రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం, వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అశ్వగంధని పాలతో కలిపి తీసుకోవడం వలన దాని గుణాలు మరింత పెరుగుతాయి. ఇది సులభంగా తయారు చేయగల ఎనర్జీ డ్రింక్ మరి ఈ అశ్వగంధ పాలు తయారీ విధానం దాని ప్రయోజనాలు, జాగ్రత్తలను తెలుసుకుందాం..
అశ్వగంధ పాల యొక్క ప్రయోజనాలు: అశ్వగంధ పాలు రోజు తీసుకోవడం వలన శరీరంలో శక్తి పెరుగుతుంది, కండరాల బలం మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక శాంతిని అందిస్తుంది. అంతేకాక నిద్రలేని సమస్యలతో బాధపడే వారికి గాఢమైన నిద్రను అందిస్తుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పాలతో కలిపిన అశ్వగంధ స్వీకరించడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
అశ్వగంధ పాలు తయారీ విధానం: ఈ పాలు తయారు చేయడం చాలా సులభం కొద్ది నిమిషాల్లోనే చేసుకోవచ్చు. అశ్వగంధ పొడి ఆఫ్ టీ స్పూన్, ఒక కప్పు పాలు గోరువెచ్చనివి తీసుకొని రెండిటినీ బాగ కలపాలి.అందులో కొంచెం బెల్లం కలిపి, రుచి కోసం కొంచెం యాలుకల పొడిని కలుపుకోవచ్చు. పూర్తిగా పాలలో అశ్వగంధ పొడి కలిసిన తర్వాత సేవించాలి. ఈ పాలను గోరువెచ్చగా తాగండి ముఖ్యంగా రాత్రి నిద్ర పోవడానికి ముందు తాగితే మంచిది.
జాగ్రత్తలు : అశ్వగంధ పాలు అనేక ప్రయోజనాలు అందించినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అశ్వగంధ ను అతిగా తీసుకోవడం వల్ల మగత,జీర్ణ సమస్యలు ఇతర దుష్ప్రభావాలు రావచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు వైద్యుని సలహా తీసుకొని వాడడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధాలు తీసుకునేవారు వైద్యున్ని సంప్రదించాలి. అశ్వగంధ కు అలర్జీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
అశ్వగంధ పాలు ఒక సులభమైన, సహజమైన ఆరోగ్యం అందిస్తాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీన్ని సరైన మోతాదులో సరైన జాగ్రత్తలతో తీసుకుంటే ఎంతో ఉపయోగం. దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుని సలహా తీసుకోవడం మంచిది.