కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం !

-

కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం లింక్–2 అనుబంధ ప్రాజెక్ట్ ఎల్లంపల్లి నుండి నీరు సరఫరా ప్రారంభం అయింది. నంది మేడారం పంపు హౌసులో 3 మోటార్లు అన్ చేసి జంట సొరంగాల ద్వారా గాయత్రి పంపు హౌసుకు నీరు సరఫరా చేస్తున్నారు అధికారులు.

Government starts Kaleshwaram water lift irrigation
Government starts Kaleshwaram water lift irrigation

గాయత్రి పంపు హౌసులోని 3 మోటర్లతో మిడ్ మానేరు ప్రాజెక్టుకు నీరు తరలిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టును అస్సలు పట్టించుకోలేదు అన్న సంగతి తెలిసిందే. పిల్లర్లు కుంగాయని ఆరోపణలు చేస్తూ.. కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కాలయాపన చేసింది రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని BRS పార్టీ పదేపదే సోషల్ మీడియాలో.. వైరల్ చేసింది. కానీ ఇప్పుడు కాలేశ్వరం మళ్లీ ఉపయోగపడిందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకుందని.. కౌంటర్ పోస్టులు కూడా పెడుతోంది గులాబీ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news